పాక్షిక మేనిఫెస్టోకి సంపూర్ణ మద్దతు…

-

తెరాస అధినేత కేసీఆర్ రాష్ట్రంలోని ఆదాయ వనరులు, ప్రజల అవసరాలను భేరీజు వేసుకుని పాక్షిక మేనిఫెస్టోని విడుదల చేశారు.  పూర్తి స్థాయి మేనిఫెస్టోని త్వరలోనే విడుదల చేస్తామని వివరించారు…

పాక్షిక మేనిఫెస్టోలోని ముఖ్యంశాలు…

‘‘రైతులు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ప్రవేశపెట్టిన పంటల పెట్టుబడి పథకం రైతుబంధు కింద ఇచ్చే వ్యయాన్ని రూ.10వేలకు పెంచుతాం.

రాష్ట్రంలో మొత్తం 45.5లక్షల మంది రైతులు వ్యవసాయ నిమిత్తం అప్పులు తీసుకున్నారు. దీంతో లక్షలోపు ఉన్న రైతుల రుణాలను మాఫీ.

రైతు సమన్వయ సమితిలకు గౌరవ భృతి ఇవ్వాలని కమిటీ ప్రతిపాదించింది…ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంత ఇవ్వాలనేది నిర్ణయం తీసుకుంటాం.

నిరుద్యోగ భృతి కింద యువతకు నెలకు రూ.3016 ఇస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులను సమగ్ర కుటుంబ సర్వే ద్వారా గుర్తించి కేటాయింపు జరుగుతుంది.

ప్రస్తుతం 40లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. పింఛను పొందేందుకు వయో పరిమితిని 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గింపు.

నెల నెలా ఇచ్చే పింఛను వృద్ధులకు రూ.1000 నుంచి రూ.2016కు, వికలాంగులకు రూ.1500 నుంచి రూ.3016కు పెంపు.

అగ్రవర్ణ పేదలకు ప్రత్యేక కార్పోరేషన్లు ఏర్పాటు చేసి.. వైశ్య కార్పోరేషన్‌ ఏర్పాటుచేసి కార్పస్‌ ఫండ్‌ఇస్తాం.

మహిళా సంఘాలకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌యూనిట్లు ఏర్పాటు

ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక పథకాల రూపకల్పన.

వీటితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు పై నిప్పులు చెరిగారు. తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రాంతవాసులందరూ..తెలంగాణ ప్రజలే…ఎలాంటి ప్రాంతీయ విభేదాలు లేవు..గత నాలుగు సంవత్సరాల పాలనే దీనికి నిదర్శనం అంటూ పేర్కొన్నారు. మేనిఫెస్టో పాక్షికం అయినప్పటికీ తెలంగాణ ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news