నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అనో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. జనాభా ప్రాతిపాదికన నియోజకవర్గాలను పునర్విభజించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అనేది తెలంగాణతో సహా ఇతర దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళలకు శాపంగా పరిణమిస్తుంది అని తెలిపారు. అలాగే ఈ విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సామాజిక మాధ్యమాల్లో వ్యక్తం చేసిన ఆందోళనలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నాను అని కెటీఆర్ స్పష్టం చేసారు.
అయితే దేశ సంక్షేమం కోసం జనాభా నియంత్రణను ఒక యజ్ఞంలా భావించి, దాన్ని విజయవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం శిక్షించాలని చూస్తోంది అని వివరించారు. అదే విధంగా జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు చేసిన కృషిని పట్టించుకోకుండా, కేవలం జనాభా ఆధారంగా నియోజకవర్గాలను పునర్విభజించడం ప్రజాస్వామ్యానికి, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం అని కెటీఆర్ అన్నారు.