ప్రణయ్ హత్య కేసులో నిందితుల అరెస్ట్

-

మిర్యాలగూడలో సంచలనం రేకెత్తించిన పరువు హత్య కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కిరాతకానికి పాల్పడి యువతి తండ్రి ఏ1 నిందితుడు మారుతీరావు, బాబాయి ఏ2 నిందితుడు శ్రవణ్ కుమార్ ని గోల్కొండ పోలీసులు కొద్ది సేపటి క్రితమే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రణయ్ హత్య అనంతరం పారిపోయిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యే పోలీసు గ్రూప్ లను రంగంలోకి దించినట్లు తెలిపారు.

అయితే శనివారం మిర్యాలగూడ పట్టణంలో ఈ రోజు ఎస్సీ సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి. ఇతర ప్రజాసంఘాల నేతలు నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ అందోళన చేపట్టారు. ప్రణయ్ కుటుంబ సభ్యులను ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి,  ఎమ్మెల్యే భాస్కర్ రావు, ఎస్టీఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పరామార్శించారు. ప్రణయ్ హత్యను చూసి తట్టుకోలేక భార్య అమృత‌ షాక్ కి గురవ్వడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version