వరద బాధితులకు కూరగాయలు, బియ్యం, ఎండు గడ్డి వితరణ చేయండంటూ టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇటీవల కురిసిన వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయన్నారు చంద్రబాబు. దశాబ్దాల తరబడి సమకూర్చుకున్న సంపదంతా వరదపాలై కట్టుబట్టలతో ప్రజలు నిస్సహాయ స్థితిలో వున్నారని, వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేతులెత్తేసింది.. మానవత్వాన్ని మరచిందని ఆరోపించారు చంద్రబాబు. మేత లేక పశువులు నకనకలాడుతున్నాయని, కూరగాయలు, బియ్యం లేక ప్రజలు, పసి బిడ్డలు దుర్భర స్థితిలో వున్నారన్నారు చంద్రబాబు. ఇళ్లల్లోకి పూర్తిగా నీరు చేరి 4 నుంచి 7 రోజులు నిల్వ ఉండిపోయాయి. ఇళ్లలో బురద చేరిపోయిందని, ఫ్యాన్లు, టీవీలతోపాటు ఇంటిలో వున్న అన్ని వస్తువులు పనికి రాకుండా పోయిన దృశ్యాలు నా పర్యటనలో చూశానన్నారు చంద్రబాబు.
వరద బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం బాధ్యత మరిచిందని, అలాంటప్పుడు బాధితుల్ని సమాజం, మానవతావాదులు, దాతలు ఆదుకోవాలన్నారు చంద్రబాబు. స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు ఆదుకోవాలని, ఇప్పటికే ఎన్‌టిఆర్ ట్రస్ట్ కొంత మేరకు సాయం అందించింది, సాయం కొనసాగిస్తున్నదన్నారు చంద్రబాబు. తక్షణం పశువులకు ఎండుగడ్డి అవసరం ఎక్కువగా వున్నదని, దాతలు వారి పేరుతో గానీ, టీడీపీ ద్వారా గాని ఎండు గడ్డి వితరణ చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు చంద్రబాబు. అలాగే కూరగాయలు, బియ్యం కూడా అందించవలసిందిగా దాతలను కోరుతున్నానన్నారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు, ఎన్‌ఆర్‌ఐలు కూడా ఎండుగడ్డి, కూరగాయలు, బియ్యం వితరణ చేయాలన్నారు.
Chandrababu Requeasted fund for flood victims
Chandrababu, Latest News, Breaking News, TDP