ఫాస్టాగ్ నుండి మరి కొన్ని ఫీచర్స్…! పెట్రోల్, డీజిల్ పేమెంట్స్ కూడా…!

-

వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఫాస్టాగ్ కి మరి కొన్ని ఫీచర్స్ ని కేంద్రం ప్రవేశ పెట్టబోతోంది. ఈ ఫీచర్స్ వల్ల వాహనదారులకు పెట్రోల్, డీజిల్, సిఎన్జి మరియు పార్కింగ్ కి ఉపయోగపడుతుంది. నిజంగా ఫాస్టాగ్ వల్ల అనేక రకాల సర్వీసులు కి కూడా వీలు అవుతున్నాయి. టెక్నికల్ గా చిన్న చిన్న సమస్యల్ని పరిష్కరించాక ఈ కొత్త సర్వీసులు కూడా వస్తాయి.

fastag

ఫాస్టాగ్ వల్ల టోల్ ప్లాజా దగ్గర రద్దీ లేకుండా సులువుగా ప్రయాణానికి వీలుగా ఉంది మరియు కరోనా వైరస్ వల్ల సమయం లో కాంటాక్ట్ లెస్ పేమెంట్ కి కూడా ఫాస్టాగ్ బాగా ఉపయోగ పడింది అని సీనియర్ అఫీషియల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ చెప్పారు.

హైదరాబాద్, బెంగుళూరు విమానాశ్రయం లో పార్కింగ్ పేమెంట్:

హైదరాబాద్ మరియు బెంగుళూరు విమానాశ్రయంలో పార్కింగ్ డబ్బులు చెల్లించడానికి ఫాస్టాగ్
ని ఉపయోగిస్తున్నారు. ఒకవేళ కనుక అక్కడ విజయవంతమైతే ఢిల్లీ లో కూడా పార్కింగ్ పేమెంట్ చేయడానికి ఫాస్టాగ్ ని ఉపయోగిస్తామని అంటున్నారు. సమాచారం ప్రకారం ఈ పద్ధతిని ముంబై, కలకత్తా మరియు చెన్నైలో కూడా ఉపయోగించనున్నారు.

ప్రభుత్వం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడి) టెక్నాలజీ సహాయం ఫాస్టాగ్ కి తీసుకుని పెట్రోల్, డీజిల్ మరియు సిఎన్జి ని కొనుగోలు చేసినప్పుడు కూడా ఉపయోగించనున్నారు. ఫాస్టాగ్ కారణంగా ఇప్పుడు టోల్ ప్లాజా వద్ద ఎక్కువ రద్దీ కూడా ఉండడం లేదు. టోల్ ప్లాజా దగ్గర వాహనాలు ఇప్పుడు గంటల కొద్దీ ఆగాల్సిన పని కూడా లేదు. దీంతో వాహనాలు కూడా అక్కడ నిలిచి పోవడం లేదు. 150 సెకండ్లలో ఇప్పుడు ఫాస్టాగ్ సహాయం తో టోల్ ప్లాజా దగ్గర వాహనదారులు వెళ్లిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version