తెలంగాణ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ్మ సతీమణి పద్మినీరెడ్డి గురువారం భాజపాలో చేరారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ కు ఊహించని షాక్ తగిలింది. భాజపా జాతీయ కార్యదర్శి మురళీదర్ రావు, తెలంగాణ భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్‌లు ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ప్రధాని మోదీపై ఉన్న అభిమానంతోనే ఆమె ఈ పార్టీలో చేరినట్లు ప్రకటించారు. సంగారెడ్డి టికెట్ ఇస్తే గెలిచి మోదీకి బహుమతిగా ఇస్తానని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత భార్య భాజపాలో చేరడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు…ఇంట గెలవలేని వారు రచ్చగెలుస్తారా? అంటూ తమ దైన శైలిలో ఇతర రాజకీయ పార్టీలు మాటలతూటాలు విసురుతున్నాయి.