Massive encounter in Chhattisgarh 12 Maoists killed: ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఛత్తీస్ గఢ్ అటవీ ప్రాంతం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. భద్రతా బలగాలకు.. మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మరణించారు. భీకర కాల్పుల అనంతరం.. భద్రతా బలగాలు గాలించగా 12 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి.
కూంబింగ్ ఆపరేషన్లో గరియాబాద్ డీఆర్ జీ, ఒడిశా ఎస్ ఓజీ దళాలు పాల్గొన్నాయి. మరణించిన మావోయిస్టులను గుర్తించే పనిలో భద్రతా బలగాలు ఉన్నాయి. ఇక ఛత్తీస్ గఢ్ అటవీ ప్రాంతం మరోసారి కాల్పుల మోత జరుగడంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.