మరో మూడు రోజులలో ఓటీటీలోకి రానున్న ఆదికేశవ….?

-

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మెగా హీరో పంజా వైష్ణవ తేజ్ సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో వైష్ణవ తేజ్ వరుస ఆఫర్ల ని యాక్సెప్ట్ చేశాడు. కానీ అతను తీసిన ఏ సినిమా కూడా ఉప్పెన రేంజ్ సక్సెస్ ని సాధించలేకపోయాయి. ఇదిలా ఉంటే వైష్ణవి తేజ్ ఇటీవల నటించిన చిత్రం ఆది కేశవ. ఈ సినిమాలో శ్రీ లీల నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీని శ్రీకాంత్ రెడ్డి తెరకెక్కించాడు.అయితే ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపెట్టలేకపోయింది.

ఇదిలా ఉండగా… ఆది కేశవ సినిమా ఈ నెల 22వ తేదీన నెట్ ఫ్లిక్స్ ఓటిటీ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమాల్లో వైష్ణవ తేజ్ మాస్ లుక్ లో కనబడతాడు. నాగ వంశీ మరియు సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇది మాస్ మసాలా చిత్రం. ఇదివరకు వచ్చిన సినిమాల లాగానే హీరో ప్రేమకి హీరోయిన్ యొక్క తండ్రి అడ్డు చెప్పడం అలాగే హీరోకి ఫ్లాష్ ప్యాక్ ఉండడం విలన్ ని ఎదిరించడం వంటి రొటీన్ కాన్సెప్ట్ తో రావడంతో ఈ సినిమా ప్రేక్షకులను అంతగా అలరించ లేకపోయింది. బాక్సాఫ్ పీస్ వద్ద సక్సెస్ కాలేకపోయినా ఈ సినిమా మరి ఓటీటీ లో ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version