ఫ్యాన్ ఇండియా ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం సలార్ పార్ట్1 : సీజ్ ఫైర్. ఈ చిత్రం ఈనెల 22వ తేదీన క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు భారీ అంచనాలతో వస్తుంది. అయితే సలార్ సినిమాలో కేజిఎఫ్ స్టార్ యష్ అతిధి పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.
అయితే ఈరోజు విడుదలైన ట్రైలర్ లో ఒక హింటూ ఇచ్చాడు. సుల్తాన్ అనే డైలాగు వచ్చినప్పుడు మెట్లు ఎక్కుతున్న వ్యక్తిని చూస్తే అతడు యష్ వలె ఉన్నట్టు కనిపిస్తున్నాడు. వాకింగ్ స్టైల్ చూస్తే అది హీరో యష్ లాగే ఉన్నది. దీంతో ఆ షాట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కే జి ఎఫ్ లో యశ్ ని సుల్తాన్ అని కొనిచోట్ల పిలుస్తూ ఉంటారు .అలాగే అందులో సుల్తాన్ అనే పాట కూడా ఉంటుంది. దీంతో ఫ్యాన్స్ ప్రస్తుతం కేజీఎఫ్ సలార్ మల్టీవర్స్ ఉంటుందని చర్చించుకుంటున్నారు. మరి సలార్ లో యష్ ఉంటాడా లేడా అనేది ఈ చిత్రం విడుదల అయ్యేదాకా వేచి చూడాలి మరి.
ఈ చిత్రానికి రవి బస్రుర్ సంగీతాన్ని సమకూరుస్తుండగా భువన్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ జగపతిబాబు ఈశ్వరి కుమారి మొదలైన వారు కీలకపాత్ర పోషిస్తున్నారు.