మహేష్‌బాబు అభిమానులకు పండగే.. గుంటూరు కారం ట్రైలర్‌ వచ్చేసింది

-

డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా జనవరి 12న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ పండుగకి ఎన్ని సినిమాలు వచ్చినప్పటికీ కూడా అందరి దృష్టి గుంటూరు కారం చిత్రంపైనే ఉంది. అతడు, కాలేజ లాంటి కల్ట్ చిత్రాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ,త్రివిక్రమ్ దర్శకత్వంలో మూడోసారి వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైనటువంటి గుంటూరు కారం ట్రైలర్ ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా అదిరిపోయింది.

దాదాపు 20 ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రంలో మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఈ సినిమాలో స్మోకింగ్ సన్నివేశాలలో నటించాడు. ఇంతకుముందు స్మోకింగ్ ఉన్న పాత్రను అతిధి సినిమాలో చేశారు. ఈ చిత్రంలో శ్రీ లీల,మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version