మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు రామ్ చరణ్. దానికి తగ్గట్టుగానే… తానేంటో నిరూపించుకున్నాడు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు.
అయితే తాజాగా టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబుకు ప్రత్యేక బహుమతులను పంపించాడు. ‘బుచ్చి… హనుమాన్ చాలీసా నాకు జీవితంలో అత్యంత గొప్ప శక్తిని ఇచ్చింది. కఠిన సమయాల్లో సైతం హానుమాన్ పై నాకున్న నమ్మకం నన్ను నిలబెట్టింది. నేను 40వ ఏటాలోకి అడుగుపెడుతున్న, ఆ శక్తిలో కొంత నీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఇది కేవలం గిఫ్ట్ మాత్రమే కాదు. నీ మీద మాకున్న ప్రేమను చాటుతుంది’ అని లేఖలో పేర్కొన్నారు చరణ్.