కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి : మంత్రి జూపల్లి

-

ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదల పక్షపాతి అని రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. శుక్రవారం మంత్రి జూపల్లి వనపర్తి జిల్లా పానగల్ మండలం రేముద్దుల, కిస్టాపూర్ తండా, గోపాలపూర్, అన్నారం గ్రామాల్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వం పరిపాలించి ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిందని ఆరోపించారు. 

భారతదేశ 75 సంవత్సరాల కాలంలో 65 సంవత్సరాలు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వాన్ని నడిపి 64వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే.. కేసీఆర్ ప్రభుత్వం కేవలం 10 సంవత్సరాల్లో 8లక్సల కోట్ల రూపాయలు అప్పు చేసిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో లక్ష యాబైవేల కోట్ల అప్పు తెచ్చి 6వేల కోట్లు బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పులకు మిత్తిలు కడుతుందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు ప్రభుత్వం పైసా పైసా కూడగట్టి దశలవారిగా అమలు చేస్తుందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version