మారుమూల ప్రాంతాల అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తా : మంత్రి సీతక్క

-

మారుమూల ప్రాంతంలో ఉన్న వెనకబడిన మండలాలు గంగారం,కొత్త గూడా అభివృద్ధికి తోడ్పడుతామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. నేడు కొత్తగూడెం మండలంలో మంత్రి సీతక్క పర్యటించారు.మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్, కలెక్టర్ శశాంక,ఐ.టి.డి.ఎ. పీఓ అంకిత్ తో కలిసి లబ్ధిదారులకు షాదీ ముబారక్‌,కల్యాణ లక్ష్మి చెక్ లను అంద చేశారు.

తాగునీటి కొరత అధికంగా ఉన్న ప్రాంతాలలో నీటిని అందించాలని అధికారులకు సూచించారు. అంగన్వాడి కేంద్ర భవనాలకి ఏమైనా మరమ్మతులు ఉంటే చేపట్టాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న 14000 పోస్ట్లు త్వరలోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. నిధులు కేటయించబడిన చోట పనులు ప్రారంభించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ హేమలత,డీడీ ట్రైబల్ వెల్ఫేర్ ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news