రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమ ఆహ్వానం అందుకున్న సెలబ్రిటీస్ వీరే.!

-

ఈనెల 22న అయోధ్యలో జరిగే శ్రీరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి  దేశ ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. అంతేకాకుండా దేశ విదేశాల నుండి ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు కూడా హాజరుకాబోతున్నారు.ఇక సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ అయోధ్యలో జరిగే వేడుకలో పాల్గొననున్నారు. ఇక టాలీవుడ్‌కు చెందిన సినీ ప్ర‌ముఖులు మెగాస్టార్ చిరంజీవి,మోహన్ బాబు, రామ్ చరణ్, రాజ‌మౌళి,జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఈ వేడుకకి ఆహ్వానము అందుకున్నారు. తమిళ ఇండస్ట్రీ నుంచి రజినీకాంత్, ధనుష్, మ‌ల‌యాళం నుంచి సురేష్ గోపి,మోహ‌న్ లాల్ క‌న్న‌డ నుంచి శివ‌రాజ్ కుమార్,రిష‌బ్ శెట్టి, కిచ్చా సుదీప్, ద‌ర్ష‌న్ తదితరులు అయోధ్య వేడుకకు ఆహ్వానం అందుకున్నారు.

ఇక బాలీవుడ్ నుంచి రణబీర్ కపూర్, సన్నీ డియోల్,అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్,మాధురి దీక్షిత్, హేమమాలిని, అలియా భట్, కంగనా రనౌత్ తదితరులు ఆహ్వానం అందుకున్నారు. ఇంకా వీరే కాకుండా ఇళయరాజా, శంకర్ మహదేవన్, అంజాద్ అలీ, సంజయ్ లీలా బన్సాలి, చంద్రశేఖర్ ద్వివేది తదితరులు ఉన్నారు. అయితే వీరిలో ఎంత మంది సెలబ్రిటీస్ ఈ వేడుకకు హాజరవుతారనే దానిపై స్పష్టత లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version