ఖైరతాబాద్ లో హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన గవర్నర్ తమిళిసై…..

-

ఈనెల 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనున్న సంగతి తెలిసిందే .ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయినాయి.ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలను శుభ్రం చేయాలని దేశ ప్రజలను ప్రధాని మోదీ కోరారు.జనవరి 22 నాటికి దేశంలోని అన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, దేవాలయాలను శుభ్రం చేయాలని , స్వచ్ఛతా ప్రచారాన్ని నిర్వహించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా జనవరి 12న మహారాష్ట్రలోని నాసిక్‌లో శ్రీ కాలారామ్ ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శుభ్రం చేశారు.

ఈ ప్రచారంలో భాగంగా తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ఖైరతాబాద్‌లోని హనుమాన్‌ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా హనుమాన్‌ ఆలయంలో స్వచ్ఛ అభియాన్‌ చేపట్టారు.దేవాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. అనంతరం లక్ష్మణ సమేత సీతారాములను దర్శించుకోని నవగ్రహ ప్రదక్షిణ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version