రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి మల్లారెడ్డి

-

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పీసీసీ అధ్యక్షుడు త్వరలో బీజేపీలోకి చేరిపోతారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని మంత్రి ఆ రెండు పార్టీల భవితవ్యాన్ని ఊహించి చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఇప్పటికే మునుగోడు ఎన్నికల సందర్భంగా కలిసిపోయారని ఆరోపించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ నాయకులందరని బీజేపీలోకి పంపిస్తున్నాడని, త్వరలోనే రేవంత్‌రెడ్డి బీజేపీలో చేరిపోతాడని అన్నారు మంత్రి మల్లారెడ్డి అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఒకటైనా మనుగోడులో భారీ మెజార్టీతో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధిస్తుందన్నారు మంత్రి మల్లారెడ్డి. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరన్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ దివాళా తీసిందని, బీజేపీ ఫెయిలైన పార్టీ అని ఎద్దేవా చేశారు. ఇటీవలే మునుగోడులో కేంద్ర మంత్రి అమిత్‌ షా, వరంగల్‌ సభలో జేపీ నడ్డా పాల్గొన్న బహిరంగ సభలు ఫలితం లేనివిగా తయారయ్యాయని అన్నారు మంత్రి మల్లారెడ్డి.

కిరాయి మనషులను తెచ్చుకుని బీజేపీ నాయకులు సభలు నిర్వహించుకున్నారని పేర్కొన్నారు మంత్రి మల్లారెడ్డి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వివిధ రాష్ర్టాల ప్రజలంతా దేశ్‌కీ నేతగా చూడాలని కోరుకుంటున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిదేండ్లుగా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన విధానాలను చూసి దేశంలోని ప్రజలంతా ఇలాంటి ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు మంత్రి మల్లారెడ్డి. ఏ రాష్ర్టానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెళ్లిన వివిధ రాష్ర్టాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు మంత్రి మల్లారెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version