రేషన్ కార్డులపై మోడీ ఫొటో.. డీకే అరుణకు ఎంపీ చామల కౌంటర్

-

రేషన్ కార్డులపై ప్రధాని మోడీ ఫొటో పెట్టాలన్న మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ వ్యాఖ్యలకు యాదాద్రి భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తాజాగా కౌంటర్ ఇచ్చారు. రేషన్ కార్డులలో మోదీ ఫోటో పెట్టాలంటే ప్రస్తుతం ఉన్న 90 లక్షల కార్డులకు కేంద్ర ప్రభుత్వమే బియ్యం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రస్తుతం తెలంగాణలో 90 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉంటే.. 54 లక్షల కార్డులకు 5 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నామన్నారు. మిగతా 34 లక్షల రేషన్ కార్డులతో పాటు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 54 లక్షల కార్డులకు ఒక కేజీ చొప్పున అదనపు బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందని చెప్పారు. ప్రతి నెల దీనిపై రూ.352 కోట్ల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. అందుకే కేంద్రం 90లక్షల కార్డులకు బియ్యం ఇస్తే ప్రధాని మోడీ ఫొటో పెడతామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news