బెట్టింగ్ మహమ్మారిపై వీసీ సజ్జన్నార్ మరో ట్వీట్ వైరల్

-

ఆన్లైన్ బెట్టింగులు, ట్రేడింగ్ మోసాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్న ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జన్నార్ తాజాగా తన సోషల్ మీడియా హ్యండిల్‌లో బెట్టింగ్ మహమ్మారికి బలైన వారికి చెందిన కథనాన్ని పోస్టు చేశారు. ‘బెట్టింగ్‌ మహామ్మారి ఇలా ఎంతో మందిని పొట్టనబెట్టుకుంటోంది. అమాయకులు తమకు తెలియకుండానే బెట్టింగ్‌కు వ్యసనపరులై తమ బంగారు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

బెట్టింగ్‌కు బానిసలై మానసిక క్షోభను అనుభవిస్తున్న వ్యక్తులకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు మద్దతుగా ఉండి భరోసా కల్పిస్తే ఇలాంటి బలవన్మరణాలను మనం ఆపొచ్చు.డబ్బు పోగొట్టుకుని బాధలో ఉన్నవారిని మరింత బాధ పెట్టకుండా సరైన కౌన్సెలింగ్ ఇస్తే వారికి ఆత్మహత్య ఆలోచన రాకుండా చేయొచ్చు.మీ చుట్టుపక్కల ఎవరైనా బెట్టింగ్ బాధితులుంటే వెంటనే గుర్తించి.. వారికి ధైర్యాన్ని కల్పించండి. బెట్టింగ్ భూతం నుంచి ఎలా బయటపడొచ్చో చెప్పండి’ అని రాసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news