తూర్పు గోదావరి జిల్లాలో జీబీఎస్ కేసుల కలకలం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో 2 రెండు కేసు నమోదు అయ్యాయి. వైద్య పరీక్షల కోసం కాకినాడ జీజీహెచ్ కి తరలించారు. ఇటీవలే విశాఖలో ఓ మహిళా మరణించడంతో ఏపీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జీబీఎస్ కేసులు వరుసగా నమోదవుతుండడం కలవరపరుస్తోంది.
ముఖ్యంగా జ్వరం, జలుబు, దగ్గు, డయేరియా వంటివి వచ్చి తగ్గిన వారం, పది రోజుల్లో కాళ్లు, చేతులు నీరసంగా ఉండడం,తిమ్మిర్లు ఎక్కడం, గొంతులోకి ముద్ద దిగకపోవడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉండడం, కాళ్లలో మంటలు వంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాలని వైద్యులు సూచిస్తున్నారు. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య సేవలు పొందాలని, లేనిపక్షంలో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తి ప్రాణాలు పోయే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. జీబీఎస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.