సీబీఐ డైరెక్టర్ గా అలోక్ వర్మనే కొనసాగుతారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మన్నెం నాగేశ్వరరావు తాత్కాలిక డైరెక్టర్ గానే కొనసాగుతారని పేర్కొంది. తనను అకారణంగా సెలవుపై పంపడగం రాజ్యాంగవిరుద్దమని పేర్కొంటూ… అలోక్ వర్మ కేసు వేసిన విషయం తెలిసిందే. కేసు విచారణకు రాకముందే కేంద్ర తోక ముడచడంపై సర్వత్రా చర్చనీయాంశంమైంది. సీబీఐ ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రధాని వ్యవహరించడం విడ్డూరంగ ఉందంటూ దేశ వ్యాప్తంగా చర్చకొనసాగుతోంది.