వారికి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..

-

యావత్తు ప్రపంచాన్నే భయాందోళనకు గురి చేసింది కరోనా మహమ్మారి. కరోనా ప్రభావానికి ఎన్నో కుటుంబాలు అస్తవ్యస్తమయ్యాయి. కోవిడ్ బారిన పది ఎంతో మంది మరణించారు. అయితే కోవిడ్‌తో చనిపోయినవారి కుటుంబాలకు రూ. 50 వేలు పరిహారంగా జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ – ఎన్‌డీఎంఏ) చెల్లించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పరిహారం కోసం నకిలీ దరఖాస్తులు కూడా వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఈ నేపధ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది.

కరోనా మృతుల విషయంలో పరిహారం కోసం నకిలీ దరఖాస్తులపై వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఈ క్రమంలో 2022 మార్చి 20 కంటే ముందు సంభవించిన కరోనా మరణాలకు 60 రోజుల్లోపు క్లెమ్ ఫైల్ చేయాలని కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ఎఫ్ పబ్లిక్ కు కరోనా మరణాల క్లయిమ్ కోసం ఫైల్ చేయాలని నోటీస్ విడుదల చేసింది. ఫేక్ క్లైమ్ చేసినట్లు తెలిస్తే వారికి జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version