ఇదేందయ్యా ఇది.. పెళ్లి కొడుకును పిచ్చి కొట్టుడు కొట్టిన పెళ్లి కూతురు బంధువులు..

-

యెంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది అనే సామెత మనం వినే ఉంటాం. అయితే ఇక్కడ కొంచెం వెరైటీగా ఓ పెళ్లి కొడుకుకు అనుభవమైంది. తన పెళ్లే తన చావుకొచ్చింది. ఇప్పుడు మీరు చదవబోయే ఘటన 5 రోజుల క్రితం జరిగింది. కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలో ఓ జంటకు ఈ నెల 22న మధ్యాహ్నం వివాహం జరిపించాలని ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అయితే అంతా బాగానే ఉంది.. పెళ్లి కొడుకు రెడీ అయ్యి సకుటుంబ సపరివార సమేతంగా బాజాభజంత్రిల నడుమ బరాత్ తో పెళ్లికి బయలు దేరాడు.

అయితే మధ్యలో తానూ పెళ్లి కొడుకునని మర్చిపోయాడో ఏమో తెలియదు గాని.. బరాత్ లో డాన్స్ చేస్తూ.. చేస్తూ.. రాత్రి 8 గంటలకు పెళ్లి మండపానికి చేరుకున్నాడు. దీంతో పెళ్లి ముహూర్తం దాటిపోయిందని పెళ్లి కూతురు కుటుంబీకులు, బంధువులు గొడవ చేశారు. అంతేకాకుండా పెళ్లి కూతురు తరుపు వాళ్ళు పెళ్లి కొడుకుపై దాడి చేసి.. పెళ్లి మండపం నుంచి గెంటేశారు.. దీంతో సదరు పెళ్లి కొడుకు పరిస్థితి చావుతప్పి కన్ను లొట్టపడినంత పనైంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version