బిర్యానీ విషయంలో హైదరాబాద్ లోని అబిడ్స్ గ్రాండ్ హోటల్లో కస్టమర్లు హోటల్ సిబ్బంది మధ్య తలెత్తిన వివాదం దాడులకు దారి తీసింది.కొత్త సంవత్సరం సందర్భంగా ధూల్ పేటకు చెందిన కొందరు బిర్యానీ తినటానికి హోటల్కు వెళ్లి మటన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. అయితే,మటన్ ఉడకలేదని వెయిటర్లతో గొడవ పడ్డారు.వివాదం చిలికి చిలికి గాలివానగా మారటంతో
కర్రలతో దాడికి దిగారు.
విచక్షణారహితంగా వెయిటర్లు కొట్టటంతో కస్టమర్లకు తీవ్రముగా గాయాలు అయినాయి. పోలీసులు హోటల్ యాజమాన్యంపై అబిడ్స్ లో కేసు నమోదు చేశారు. కాగా, సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసిన వెయిటర్లను అరెస్ట్ చేశారు. విషయం తెలిసిన తర్వాత గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ వెంటనే హోటల్ యజమానితోపాటు దాడి చేసిన అందరినీ అరెస్ట్్ చేయాలని పోలీస్ స్టేషన్ సిఐని డిమాండ్ చేశారు.ఒక వేళ అరెస్ట్ చేయకపోతే హోటల్కు నిప్పు పెడతామని ఎమ్మెల్యే రాజా సింగ్ వార్నింగ్ ఇచ్చారు.