అదృష్టం అంటే వార్న‌ర్‌దే..! అలా వ‌న్డేల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించ‌గానే.. ఇలా టీ20ల‌కు కెప్టెన్‌గా

-

కొత్త సంవత్సరం మొదటి రోజునే డేవిడ్ వార్నర్ అభిమానులకు షాక్ ఇచ్చాడు.వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు వెల్ల‌డించాడు. ఇప్ప‌టికే ఆఖరి వన్డే మ్యాచ్ ఆడినట్లుగా వెల్ల‌డించాడు. గ‌త ఏడాది భార‌త్‌లో జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచే త‌న‌కు వ‌న్డేల్లో చివ‌రిది అని చెప్పి ఫ్యాన్స్‌కు షాకిచ్చాడు. ఇక మ‌రో వారం రోజుల్లో టెస్టుల నుంచి కూడా తప్పుకొనున్నట్లు వెల్లడించాడు. పాకిస్తాన్‌తో జ‌న‌వ‌రి 3 నుంచి ప్రారంభం కాబోయే మూడో టెస్టు మ్యాచే వార్న‌ర్ కెరీర్‌లో ఆఖ‌రి ఇంటర్నేషనల్ టెస్టు మ్యాచ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి.

జ‌న‌వ‌రి 20 నుంచి ఫ్రిబ్ర‌వ‌రి 18 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న ఇంట‌ర్నేష‌న‌ల్ లీగ్ టీ20 లో దుబాయ్ క్యాపిట‌ల్స్ కు డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం. ఈ విష‌యాన్ని తన ఫ్రాంచైజీ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్రకటించింది. కెప్టెన్ మార్వెల్ అంటూ ఓ కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. కాగా.. ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు దుబాయ్ క్యాపిట‌ల్స్ అనుబంధ జ‌ట్టు అన్న విషయం తెలిసిందే.

 

దుబాయ్‌ క్యాపిటల్స్‌ జట్టు ఇదే :

డేవిడ్‌ వార్నర్ ( కెప్టెన్ ), ఆండ్రూ టై,దుష్మంత చమీర, దసున్‌ షనక,జో రూట్‌, మాక్స్‌ హోల్డెన్‌,మార్క్‌ వుడ్‌,రోవ్‌మన్‌ పావెల్‌, మ‌హ్మ‌ద్‌ మొహ్సిన్‌, సామ్‌ బిల్లింగ్స్‌,నువాన్‌ తుషార,రజా ఆకిఫ్‌, రహ్మనుల్లా గుర్బాజ్‌, సదీర సమరవిక్రమ,రోలోఫ్‌ వాన్‌డెర్‌ మెర్వే, సికిందర్‌ రజా.

Read more RELATED
Recommended to you

Exit mobile version