IPL : ఐపీఎల్ 2024 నుంచి హార్దిక్ పాండ్య ఔట్‌..? ముంబై కెప్టెన్ ఎవ‌రో తెలుసా..?

-

గుజ‌రాత్ టైటాన్స్‌ నుంచి ఆల్ రౌండర్ పాండ్య‌ను ట్రేడింగ్‌లో తీసుకుని ముంబై ఇండియన్స్ అందరిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అంతేకాకుండా ముంబై జ‌ట్టుకు ఐదు సార్లు టైటిళ్ల‌ను అందించిన రోహిత్ శ‌ర్మ‌ను సారథ్య బాధ్య‌త‌ల నుంచి తొలగించింది. హిట్ మ్యాన్ స్థానంలో హార్దిక్ పాండ్య‌కు కెప్టెన్ పగ్గాలు అప్ప‌గించింది. అయితే.. వ‌న్డే వరల్డ్ కప్ లో గాయ‌ప‌డిన హార్దిక్ ఇంకా కోలుకోలేదని వార్త‌లు వ‌స్తున్నాయి.

పాండ్య జ‌న‌వ‌రి 11 నుంచి అఫ్గానిస్తాన్‌తో ప్రారంభం కానున్న మూడు టీ20 మ్యాచుల సిరీస్‌కు దూరం అయ్యాడు.అంతే కాకుండా ఐపీఎల్ 2024 సీజ‌న్‌కు కూడా అందుబాటులో ఉండే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉన్నాయ‌ని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక‌వేళ రాబోయే ఐపీఎల్ 2024 సీజ‌న్‌కు పాండ్య దూరం అయితే ముంబై జట్టుకు అది గ‌ట్టి ఎదురుదెబ్బ‌గానే చెప్ప‌వ‌చ్చు. అప్పుడు ముంబై టీం కు కెప్టెన్‌గా ఎవ‌రు పగ్గాలు చేపడుతారు అనే చ‌ర్చ మొద‌లైంది.

ఒక‌వేళ పాండ్య ఐపీఎల్ కి దూరం అయితే.. రోహిత్ శ‌ర్మ‌ను తిరిగి కెప్టెన్‌గా నియ‌మించాల‌ని అభిమానులు అంటున్నారు. అయితే తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం రోహిత్ శర్మ కేవ‌లం ప్లేయర్ గా మాత్ర‌మే కొన‌సాగుతాన‌ని స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో సూర్య‌, బుమ్రా, ఇషాన్‌ల‌లో ఒక‌రు ముంబై ఇండియ‌న్స్‌కు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version