అమరావతి (జంగారెడ్డిగూడెం): పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో విలీనమైన కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో సోమవారం పర్యటించిన పవన్ కళ్యాణ్ నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుత్తేదార్లను మార్చడంలో ఆసక్తి కనబరుస్తున్నారని.. ఆయనకు నిర్వాసితుల గోడు మాత్రం పట్టడం లేదని పవన్ విమర్శించారు. వేలేరుపాడు ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మావోయిస్టుల ప్రభావం ఉన్న ప్రాంతం కావడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.