సీబీఐ అధికారుల ఛాంబర్లను సీజ్ చేసిన… సీబీఐ నూతన డైరెక్టర్

-

అవినీతి ఆరోపణల నేపథ్యంలో  సీబీఐలో సంచలనం రేకెత్తించిన సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మా, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇద్దరు అధికారుల మధ్య వివాదం ప్రధానికి చుట్టుకోవడంతో స్వయంగా మోదీ రంగంలోకి దిగారు. దీంతో సీబీఐ నూతన డైరెక్ట్ గా మంగళవారం అర్థరాత్రి  తెలంగాణకు చెందిన ఐపీఎస్ అధికారి నాగేశ్వరరావుని నూతన డైరెక్టర్ గా నియమించారు. దీంతో  కేంద్ర కార్యాలయంలోని  అదే శాఖకు  సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మా, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థాన లకు చెందిన 10,11 అంతస్తుల్లోని ఛాంబర్లను  సీజ్ చేశారు.

బాధ్యతలు చేపట్టిన  కొద్ది గంటల్లోనే అదే శాఖకు చెందిన  అధికారులపై చర్యలు తీసుకోవడంలో విచారణ వేగవంతం చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మంగళవారం అర్థరాత్రి ప్రధాని ఆదేశాల మేరకు కేంద్ర కేబినేట్ నిర్ణయం మేరకు మన్నెం నాగేశ్వరావుని నూతన డైరెక్టర్ గా ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version