‘సీబీఐ మాజీ జేడీ’ ఇంట్లో దొంగ దొరికాడు..

-

దాదాపు ఏడాది క్రితం  సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ నివాసంలో జరిగిన చోరీ కేసును  బంజారాహిల్స్ పోలీసులు చాలా నేర్పుతో చేధించారు.  గతంలో కారు డ్రైవర్ గా పనిచేసిన రవికుమార్ ని  అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి రూ.20 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్. శ్రీనివాస్ కేసు వివరాలను వెల్లడిస్తూ…  బంజారాహిల్స్ రోడ్ నెం.12లో నివాసం ఉంటున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు వేడుకకు వెళ్లొచ్చేసరికి.. లాకర్లో ఖరీదైన నగలు ఉన్న బాక్స్ మాయమైనట్లు గుర్తించారు. దీంతో 2017 నవంబర్ 17న లక్ష్మీనారాయణ సతీమణి ఊర్మిళ బంజారాహిల్స్ పోలీసులకు ఇంట్లో పనిచేస్తున్న వారిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు అనుమానితులను పలు మార్లు ప్రశ్నించిన వారి నుంచి ఎలాంటి ఆధారాలు లభించలేదు… దీంతో వారిపై కొన్నాళ్లు నిఘా ఉంచడంతో అసలు కథ తెలిసింది. గతంలో పనిచేసిన కారు డ్రైవర్ రవికుమార్ వ్యవహార శైలిపై అనుమానం రావడంతో తమ దైన శైలిలో ప్రశ్నించడంతో దొంగతనాన్ని ఒప్పుకున్నాడు.. దొంగిలించిన మొత్తం సొత్తులో కొంత భాగం తాకట్టు పెట్టి మరికొంత వేరేవాళ్లకు ఇచ్చినట్లు పేర్కొన్నాడు…ఆ మొత్తం సొత్తును పోలీసులు రికవరీ చేశారు. కేసుని ఏడాది పాటు చాలా నేర్పుతో చేధించిన వారిని డీసీపీ అభినందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version