హనుమాన్ మూవీ మొదటివారం కలెక్షన్స్ ఎంతంటే……

-

యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా రూపొందిన తాజా చిత్రం. ఈ సినిమా లో అమృత అయ్యర్ హీరోయిన్గా నటించింది . సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వండర్స్ క్రియేట్ చేస్తోంది. విడుదలైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో పాటు డివోషనల్ కంటెంట్ ఉండడంతో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఇక ఈ చిత్రం మొదటి వారం రోజులకు గాను 150 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసినట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఒక కుర్ర హీరోకి ఈ రేంజ్ లో వసూళ్లు రావడం అంటే అది మామూలు విషయం కాదు.

 

ఈ వారం కూడా ఒక్క తెలుగు సినిమా థియేటర్లలో రిలీజ్ కాకపోవడంతో పాటు గుంటూరు కారం సహా నా సామి రంగ, సైందవ్ కు ఇచ్చిన ధియేటర్లు కూడా హనుమాన్ కి యాడ్ కావడంతో మరిన్ని వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఇక నార్త్ అమెరికాలో కూడా ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి టాప్ సిక్స్త్ గ్రాసర్ గా నిల్చింది. అల వైకుంఠపురంలో సినిమాకి కొద్దిగా వెనకబడి ఉండడంతో ఆ రికార్డును కూడా దాటి టాప్ ఫిఫ్త్ ప్లేస్ కి హనుమాన్ చేరుకునే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news