ఢిల్లీ విమానాశ్రయంలో 10 కోట్లు విలువ చేసే డ్రగ్స్ పట్టివేత..!

-

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం లో భారీ గా డ్రగ్స్ పట్టుకున్నారు. కస్టమ్స్ అధికారులు 10.14 కోట్ల విలువ చేసే 676 గ్రాముల‌ కొకైన్ సీజ్ చేసారు. అయితే కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా కొకైన్ ను క్యాప్సూల్స్ లో నింపి పొట్టలొ దాచి తరలించే ప్రయత్నం చేసాడు నిందితుడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 90 క్యాప్సూల్స్ పొట్టలో దాచాడు కేటుగాడు.

బ్యాంకాక్ నుండి ఇథియోపియా మీదుగా ఢిల్లీ చేరుకున్నాడు ఫిలిప్పీన్స్ జాతీయుడు. అయితే గ్రీన్ చానెల్ దాటగానే ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లోనే స్పృహ కోల్పోయాడు కేటుగాడు. దంతో వెంటనే హుటాహుటిన అతడిని ఆసుపత్రికి తరలించింది కస్టమ్స్ బృందం. కానీ అక్కడే అతని పొట్టలో కొకైన్ గుర్తించారు కస్టమ్స్ అధికారులు. అనంతరం శస్త్రచికిత్స చేసి పొట్టలో దాచిన క్యాప్సూల్స్ ను బయటకు తీసి నిందితుడి ప్రాణాలు కాపాడారు వైద్యులు. అలాగే NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news