జగన్ చేస్తున్న ధర్నాలు చూసి ప్రజలు చీ కొడుతున్నారు అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ ధర్నాలు ఎందుకు చేస్తున్నారు. అభివృద్ధి చూసి ఓర్వలేక జగన్ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు. గత ప్రభుత్వంలో పడిసార్లు కరెంట్ బిల్ పెంచిన పాపం ఎవరిది. ప్రజలపై 32 వేల కోట్ల భారం వేసింది జగన్ కాదా.. 10 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి సిగ్గు లేకుండా ధర్నా లు చేస్తున్నారు. మనమే చార్జీలు పెంచి మనమే దర్నా చేయటం ఏంటని వైసీపీ నేతలు అనుకుంటున్నారు.
పార్లమెంట్ లో వైసీపీ కి ప్రతిపక్ష హోదా ఏమైనా ఉందా ఎందుకు సమావేశాలకి వీరి సభ్యులు వెళుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి కొంప వదిలి రాని నువ్వు ఇప్పుడు తగుదనమ్మ అంటూ బయలుదేరావా.. రైతులు ధాన్యం అమ్మిన మూడు గంటల్లో వారి ఖాతాలో నగదు జమ అవుతుంది. రాక్షస పాలన ఎలా ఉంటుందో మీరు చూపిస్తే ప్రజా రంజక పాలన ఎలా ఉందో చంద్రబాబు చూపిస్తున్నారు. వైసిపి ఐదేళ్ల పాలనలో జగన్ జల్సా పథకాలు అందరు చూశారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కోసం 300 కోట్లు కేటాయించిన నాయకుడు చంద్రబాబు అని గుమ్మడి సంధ్యారాణి అన్నారు.