చేయని తప్పుకి కార్మికున్ని చితకబాదిన పంజాగుట్ట పోలీసులు..!

-

నిమ్స్ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. చేయని తప్పుకి అక్కడ నిమ్స్ ఆసుపత్రి లో పని చేస్తున్న ఓ కాంట్రాక్ట్ కార్మికున్ని పంజాగుట్ట పోలీసులు చితకబాదారు. అసలు ఏం జరిగింది అంటే.. నిమ్స్ ఆస్పత్రికి ఎమ్మారై స్కానింగ్ కోసం వచ్చిన ఓ పేషెంట్ యొక్క బంగారు గొలుసు పోయిందని ఆ కాంట్రాక్టు కార్మికుని చితకబాదారు పోలీసులు. సదరు పేషెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కాంట్రాక్టు కార్మికున్ని కొట్టారు.

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అనంతరం ఆ పేషంట్ ఇన్నర్ పాకెట్లోనే పోయింది అనుకుంటున్న బంగారు గొలుసు దొరికింది. ఇక ఎటువంటి విచారణ లేకుండా పోలీసులు ఈ విధంగా మాములు కార్మికుడినీ కొట్టడాన్ని ఖండిస్తున్నాయి కార్మిక సంఘాలు. కనీసం అతను ఎవరి కింద పని చేస్తున్నాడో ఆ కాంట్రాక్టర్ కి.. లేదా నిమ్స్ యాజమాన్యానికి కూడా సమాచారం ఇవ్వకుండా కార్మికున్ని పోలీసులకు అప్పగించింది ఎమ్మారై విభాగం. అయితే ప్రస్తుతం ఆ పోలీసుల చేతులో దెబ్బలు తిన్న ఆ కార్మికుడు నిమ్స్ ఎమర్జెన్సీలో చికిత్స పొందుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news