10 మంది గ‌ర్ల్ ఫ్రెండ్స్..కోరిక‌లు తీర్చేందుకు దొంగ‌గా మారిన బాయ్ ఫ్రెండ్..!

ఓ యువకుడు తన గర్ల్ ఫ్రెండ్స్ కోసం దొంగగా మారాడు. గర్ల్ ఫెండ్స్ కోరిక తీర్చేందుకు వజ్రాలు…ఖరీదైన కార్లు దింగలించడం మొదలు పెట్టాడు. చివరికి పోలీసులకు దొరికి కటకటాల్లోకి వెళ్ళాడు. వివరాల్లోకి వెళితే ఇర్ఫాన్ అనే యువకుడికి ఇప్పటికే పెళ్లి కాగా భార్య మరియు స్నేహితుడితో కలిసి దొంగ తనాలు చేస్తున్నాడు. అంతే కాకుండా అతర్జాతీయ దొంగగా ఇర్ఫాన్ పై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. ఇర్ఫాన్ పై పలు రాష్ట్రాల్లో 25 కేసులు ఉన్నాయి.

రీసెంట్ గా ఓ జాగ్వార్ కారును దొంగలించి ఉత్తర ప్రదేశ్ ఘజియా బాద్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇక ఈ అంతర్జాతీయ దొంగను పోలీసులు విచారించగా తనకు పది మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని వారి కోరికలు తీర్చేందుకు దొంగగా మారా అని షాకింగ్ నిజాలు భయట పెట్టాడు. ఇక నిందితుడి తో పాటు పోలీసులు అతడికి సహకరించిన భార్య, స్నేహితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు ఖరీదైన వజ్రాలు, ఆభరణాలు దొంగలించినట్టు గుర్తించి కేసులు నమోదు చేశారు.