చైనాలో కరోనా కలకలం.. 11 ప్రావిన్సుల్లో కరోనా కేసులు

-

చైనాలో మరోమారు కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరగుతోంది. తాజాగా కరోనా అవుట్ బ్రెక్ లతో అక్కడి ప్రభుత్వం మళ్లీ లాక్డౌన్ విధిస్తోంది. చైనాలో మూడింత ఒక వంతు అంటే దాదాపు 11 ప్రావిన్సుల్లో కోత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు ఈ ప్రావిన్సుల్లో వారం రోజుల వ్యవధిలో 100కు పైగా కేసులు నమోదయ్యాయి. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో అక్కడి ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది.

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులను నమోదు చేస్తోంది. ముఖ్యంగా చైానా ఉత్తర ప్రాంతంలోని ప్రావిన్సుల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. గాన్సు, ఇన్నర్ మంగోలియా, నింగ్ క్సియా, గుయిజౌ, బీజింగ్ ప్రాంతాల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లోకి టూర్లకు వెళ్లడాన్ని అధికారులు నిశేధించారు. మరోవైపు దేశ రాజధాని బీజింగ్ లో ఇప్పటి వరకు 14 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో నగరంలోకి వచ్చే వారిపై అధికారులు నిబంధనలు విధిస్తున్నారు. నగరంలోకి వచ్చే వారు ఖచ్చితంగా కరోనా నెగిటివ్ రిపోర్టు చూపించడంతో పాటు. 14 రోజుల పాటు హెల్త్ మానిటరింగ్ లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news