ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి విద్యార్థులకు మార్చి లో జరిగిన పబ్లిక్ పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రభుత్వం ఒక కీలక సూచన అందించింది. ఈ విద్యార్థులు అందరూ రానున్న మార్చి లో పబ్లిక్ పరీక్షలు రాయవచ్చని విద్యాశాఖ తెలిపింది. ఇందుకు గాను ఈ రోజు నుండి సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఫీజులు చెల్లించాలని ప్రకటన జారీ చేసింది. ఇక విద్యాశాఖ స్కూళ్లకు సైతం ఫీజులు తీసుకోవడానికి ఏర్పాట్లు చేయాలనీ ఆదేశాలు ఇచ్చింది. నిరాయించిన గడువు ముగిసిపోతే … సెప్టెంబర్ 20 వరకు రూ. 50 ఫైన్ తో చెల్లించాలి, అదే విధంగా సెప్టెంబర్ 30 వరకు అయితే రూ. 500 ఫైన్ తో ఫీజు కట్టాలని నిబంధనలను విధించింది. ఇక విద్యార్థులు మూడు సబ్జెక్టు ల వరకు ఒక్కో సబ్జెక్టు కు రూ. 110 మరియు మూడు సబ్జెక్టు లు దాటితే ఒక్కో సబ్జెక్టు కు రూ. 125 లు చెల్లించాలని విద్యాశాఖ తెలిపింది.
టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్ !
-