నేటి తరుణంలో డబ్బు అనేది ఎవరికైనా ఎంత ఆవశ్యకం అయిందో అందరికీ తెలిసిందే. ఏది కొనాలన్నా, ఏం చేయాలన్నా ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం అవుతోంది. అన్ని సమస్యలకు ప్రధాన కారణం డబ్బే అన్నది జగమెరిగిన సత్యం. అయితే కొందరిని మాత్రం ఎప్పుడూ ఆర్థిక సమస్యలు పట్టి పీడిస్తుంటాయి. దీంతో వారి చేతిలో డబ్బు నిలవదు. వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చవుతుంది. అలాంటి వారు కింద చెప్పిన సూచనలు పాటిస్తే.. ఆర్థిక సమస్యలను తొలగించుకోవచ్చు. పైగా సంపాదించే డబ్బు నిలుస్తుంది కూడా.. మరి అందుకు ఏం చేయాలంటే…
1. ఇంట్లో నైరుతి దిశలో పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పెట్టుకోవాలి. నిత్యం ఆ విగ్రహానికి దండం పెట్టుకోవాలి. దీంతో ఆర్థిక సమస్యలు పోతాయి.
2. ఇంటికి ఉన్న ప్రధాన ద్వారం వద్ద తలుపుల పక్కనే గోడలపై లక్ష్మి లేదా కుబేరుడు లేదా స్వస్తిక్ సింబల్ ఉన్న ఫొటోను పెట్టుకోవాలి. దీంతో డబ్బు వృథా ఖర్చు కాకుండా ఉంటుంది.
3. ఇంట్లో ఉన్న వాస్తు దోషంతోపాటు ఆర్థిక సమస్యలు పోవాలంటే వాస్తు పురుషుడి విగ్రహం లేదా ఫొటోను ఇంట్లో పెట్టుకోవాలి.
4. మట్టితో తయారు చేయబడిన కూజాను ఇంట్లో పెట్టి అందులో ఎప్పుడూ నీటిని ఉండేలా చూసుకోవాలి. ఇక ఈ కూజా ఉత్తరం మూలలో ఉండాలి. దీని వల్ల డబ్బు పొదుపు అవుతుంది. ఖర్చులు తగ్గుతాయి. డబ్బు చేతిలో నిలుస్తుంది. అయితే కుండను తెరచి ఉంచరాదు. కచ్చితంగా మూత పెట్టాలి. అందులో నీరు కూడా కచ్చితంగా ఉండాల్సిందే.
5. లోహంతో తయారు చేయబడిన చేప లేదా తాబేలు బొమ్మను ఇంట్లో ఉంచుకుంటే అన్ని రకాల సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.
6. వెండి, ఇత్తడి లేదా రాగితో తయారు చేసిన పిరమిడ్ బొమ్మను ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లోని కుటుంబ సభ్యుల ఆదాయం రెట్టింపవుతుంది.
7. షాపు లేదా వ్యాపారం చేసేవారు క్యాష్ లాకర్ ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవాలి. దీంతో వ్యాపారంలో లాభాలను పొందవచ్చు.
8. షాపులను కాంతి వెదజల్లే విధంగా చక్కని విద్యుద్దీపాలతో అలంకరించుకోవాలి. దీని వల్ల వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతుంది. అందుకే చాలా వరకు పెద్ద పెద్ద షాపులు, మాల్స్ ను ధగధగలాడే దీపాలతో అలంకరిస్తారు. అయితే ఈ తరహా అలంకరణ ఇండ్లకు మాత్రం చేయరాదు. కేవలం షాపులు, వ్యాపారానికే పరిమితం చేయాలి.
9. షాపు ఉండే గదుల గోడలు పగలకూడదు. పగుళ్లు ఉంటే పూడ్చుకోవాలి. ఎల్లప్పుడూ షాపు లేదా ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే ధనం బాగా లభిస్తుంది.
10. చాలా మంది మెట్ల కింద చీపుర్లు, ఇల్లు తుడిచే మాపులు, చెప్పులు, షూస్‌లను ఉంచుతారు. అలా చేయరాదు. చేస్తే ఆర్థిక సమస్యలు వస్తాయి. కనుక వాటిని వెంటనే తీసేయాలి.
11. ఇంట్లో గ్యాస్ స్టవ్‌ను ఎట్టి పరిస్థితిలోనూ ఉత్తరం దిశలో పెట్టరాదు. ఇంటిని చీకటిగా ఉంచరాదు. పగటి పూట చీకటి ఉంటే లైట్లు వేసుకోవాలి.
12. ఇండ్లలోకి సూర్యుడు, చంద్రుని కిరణాలు పడే విధంగా వెంటిలేషన్ ఉండాలి. దీని వల్ల సూర్య చంద్రుల నుంచి వచ్చే పాటిజివ్ ఎనర్జీ మన సమస్యలను పోగొడుతుంది. ఆర్థిక సమస్యలు కూడా పోతాయి. డబ్బు బాగా సంపాదిస్తారు.