రాష్ట్ర ప్రభుత్వం నడిపే మెడికల్ కాలేజీల్లో స్థానిక కోటా లేకపోతే ఎలా? : హరీశ్ రావు

-

కేంద్ర బడ్జెట్ మీద మాజీ మంత్రి,బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు రూపాయి కూడా కేటాయించకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.దక్షిణ భారతదేశమంటేనే మొదటి నుండి బీజేపీకి చిన్నచూపు అని మండిపడ్డారు.


గతంలో కూడా దేశవ్యాప్తంగా 142 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్క కాలేజీ ఇవ్వలేదు.మెడికల్ పీజీ విషయంలో కూడా ఇదే జరిగింది.
దక్షిణాదిలో రాష్ట్ర ప్రభుత్వాలే నిధులు పెట్టుకొని కాలేజీలు, ఆస్పత్రులు నడుపుతుంటే మెడికల్ కాలేజీ సీట్లలో 50% స్థానిక కోటా ఉండదు అంటే తీవ్ర అన్యాయం చేయడమే కదా? అని ప్రశ్నించారు. కాగా, నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిధుల కేటాయింపుల్లో రాష్ట్రానికి మొండిచేయి చూపించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news