12th ఫెయిల్’ ఐపీఎస్ అధికారికి మెరిటోరియస్ సర్వీస్ మెడల్…

-

విధు వినోద్ చోప్రా డైరెక్షన్‌లో విక్రాంత్ మస్సే నటించిన తాజా చిత్రం’12th ఫెయిల్’. ప్రముఖ ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ చిత్రంకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి హృదయాన్ని హత్తుకుంటుంది. 2019లో 12th ఫెయిల్ అయిన మనోజ్ కుమార్ శర్మ ఎన్నో కష్టాలుపడి ఐపీఎస్ ఆఫీసర్ ఎలా అయ్యారు అని అనురాగ్ పాఠక్ రాసిన పుస్తకాన్ని ఆధారం చేసుకొని ఈ సినిమాని తెరకెక్కించారు.

ఇదిలా ఉంటే తాజాగా 2005 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన మనోజ్ కుమార్ శర్మకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అత్యున్నత మెడల్ ప్రకటించింది. మహారాష్ట్ర కేడర్‌కి చెందిన ఐపీఎస్ మనోజ్ కుమార్, బీహార్ కేడర్‌కు చెందిన అతని బ్యాచ్‌మేట్ జితేందర్ రాణా, మరికొంత మందితో కలిసి ‘మెరిటోరియస్ సర్వీస్ మెడల్’ అందుకోనున్నారు. 75వ రిపబ్లిక్ డే సందర్భంగా ఆయనకు ఈ మెడల్ ప్రధానం చేస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version