ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కరోనా బులిటెన్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేశారు. ఈ కరోనా బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో.. గడిచిన 24 గంటలలో 1,679 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. నిన్నటి తో పోలిస్తే.. రాష్ట్రంలో నేడు దాదాపు 200 కరోనా కేసుల సంఖ్య తగ్గింది. కాగ నేటి వరకు రాష్ట్రంలో 2308622 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కాగ రాష్ట్రంలో నేడు అత్యధికంగా తూర్పు గోదావరి లో 350 కరోనా కేసులు వెలుగు చూశాయి.
కాగ నేడు రాష్ట్రంలో కరోనా మహమ్మారి కారణంగా ఇద్దరు మృతి చెందారు. చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కోక్కరి చొప్పున కరోనా బాధితులు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 14,679 కి చేరింది. అలాగే గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా 9,598 కరోనా బాధితులు మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 46,119 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగ రాష్ట్రంలో ఈ రోజు 27,522 కరోనా శాంపిల్స్ ను పరీక్ష చేశారు.