BREAKING : ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం.. 175 ఇంటర్‌ కాలేజీలపై వేటు

-

నిబంధనలకు విరుద్ధంగా కాలేజీలు నిర్వహిస్తున్న ఇంటర్‌ కాలేజీలపై కొరడా ఝుళిపించింది ఏపీ విద్యాశాఖ. ఈ నేపథ్యంలోనే.. రాష్ట్రంలో ఒకేసారి 175 ప్రైవేటు ఇంటర్‌ కాలేజీల గుర్తింపును రద్దు చేసింది ప్రభుత్వం. ఈ మేరకు గురువారం తాడేపల్లిలోని ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నేతృత్వంలో జరిగిన ఇంటర్‌ బోర్డు సమావేశంలో చేసిన తీర్మానానికి ఆమోదముద్ర పడింది. నిర్దేశిత ప్రమాణాలు లేవనే కారణంతో ఇప్పటికే ఆ కాలేజీలకు నోటీసులు జారీచేశారు. మరో 3నెలల సమయం ఇస్తే నిర్దేశించిన ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకుంటామని యాజమాన్యాలు కోరాయి. కానీ ఇంటర్‌ బోర్డు సమయం ఇచ్చేందుకు నిరాకరించింది. ఆయా కాలేజీల్లో ఉండే సుమారు 20వేల మంది విద్యార్థులను ఇతర కాలేజీల్లో చేరాలని బోర్డు సూచించనుంది.

ఇప్పటివరకూ ఉన్న ఇంటర్మీడియట్‌ కాలేజీలు, హాస్టళ్లు ఎలా ఉండాలో పేర్కొంటూ ప్రభుత్వం రూపొందించిన కొత్త రెగ్యులేషన్‌కు బోర్డు ఆమోదం తెలిపింది. అలాగే, ఇంటర్‌ కాలేజీల గుర్తింపు, అఫిలియేషన్ల రెన్యువల్‌ లాంటి అంశాలను మాన్యువల్‌ నుంచి ఆన్‌లైన్‌లోకి మార్చారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను మంత్రి బొత్స ప్రారంభించారు. ఇకపై అనుమతులన్నీ ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారానే జరుగుతాయి. అలాగే ఇంటర్‌ పరీక్షల విధానంలో ప్రశ్నపత్రాలను ఆన్‌లైన్‌ చేయాలని ఇంటర్‌ విద్యామండలి చేసిన ప్రతిపాదనకు తర్వాతి బోర్డు సమావేశంలో ఆమోదం లభించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version