ప్రధానమంత్రి రోజ్గార్ యోజన స్కీం కి అప్లై చేయాలా? అర్హత వివరాలు, దరఖాస్తు విధానం తెలుసుకోండి..!

-

దేశ అభివృద్ధి బాగుండాలి అంటే యువత అన్ని రంగాలలో ముందు ఉండాలి. ముఖ్యంగా ప్రభుత్వం నిరుద్యోగత తగ్గించేందుకు వివిధ పథకాలను యువతకు అందించడం ద్వారా దేశ భవిష్యత్తు బాగుంటుంది. దాని కోసం ప్రభుత్వం ప్రధానమంత్రి రోజ్గార్ యోజన అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పథకం ద్వారా చదువుకున్న యువతకు స్వీయ ఉపాధి అవకాశాలను అందిస్తుంది. ఈ విధంగా వ్యాపారస్తులుగా ఎదగడానికి ఆర్థిక సహాయం కూడా అందిస్తోంది.

అర్హత వివరాలు:

ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవారు కనీసం 6 నెలల పాటు ఏదైనా ట్రేడ్ ఇన్ ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలలో శిక్షణ పొందడం వలన వారి దరఖాస్తుకు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు. 18 ఏళ్ల నుండి 35 ఏళ్ల మధ్య ఉన్న నిరుద్యోగులకి ఈ అవకాశం దక్కుతుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారు కనీసం 8వ తరగతి పూర్తి చేయాల్సి ఉంటుంది మరియు కుటుంబ ఆదాయం 40 వేల నుండి లక్ష రూపాయల వరకు ఉండాలి. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారు అదే ప్రదేశంలో కనీసం మూడు ఏళ్లు గా ఉండాలి.

అప్లై చేసే విధానం:

మీరు చేసిన ప్రాజెక్ట్ కు ఆమోదన వచ్చిన తర్వాత ఈ పథకానికి సంబంధించిన ఫారం ను నింపాల్సి ఉంటుంది మరియు దీనిని ఇతర డాక్యుమెంట్లతో పాటుగా ఫోటోగ్రాఫ్ తో సబ్మిట్ చేయాలి. ఈ ప్రక్రియ మొత్తం డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ లేక మీరు అప్పు తీసుకునేటువంటి బ్యాంకు వద్ద పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు పూర్తి అయిన తర్వాత ఎంపిక అయిన వారికి ఇంటర్వ్యూ ఉంటుంది. దీనిలో ఎంపిక అవ్వడం వలన లోన్ తీసుకోవడానికి అర్హులు అవుతారు మరియు వీటిని ప్రతి జిల్లాలో నిర్వహిస్తారు. ఈ విధంగా అప్పు తీసుకున్న తర్వాత మూడు నుండి ఏడు ఏళ్లలోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే ఈ లోన్ కు ఎలాంటి తాకట్టు అవసరం లేదు లేక ఆస్తి పత్రాలు వంటివి అవసరం లేదు. ఈ విధంగా ప్రధానమంత్రి రోజ్గార్ యోజన లో భాగంగా ఆర్థిక సహాయాన్ని పొంది వ్యాపారాలను ప్రారంభించవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version