’18 పేజెస్‌ :ఒక్కటి తగ్గింది నిఖిల్ ! అందుకే!

-

నిఖిల్ హీరోగా అనుపమా పరమేశ్వరన్‌  హీరోయిన్ గా  ’18 పేజెస్‌’. సినిమా పోయిన శుక్రవారం విడుదల అయిన సంగతి తెలిసిందే. దిగ్గజ  దర్శకుడు సుకుమార్‌ అందించిన కథతో పల్నాటి సూర్యప్రతాప్‌ దర్శకత్వంలో అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో నడుస్తోంది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ వచ్చి సందడి చేయడం తో మూవీ పై హైప్ క్రియేట్ అయ్యింది. అలాగే నితిన్ కార్తికేయ 2, సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో సినిమా పై చాలా అంచనాలు నెలకొన్నాయి. కాని ఆశించినంత కలెక్షన్ రావటం లేదు. ఒక పక్క అప్పుడే రిలీజ్ అయిన ధమాకా కలెక్షన్స్ అదుర్స్ అనిపిస్తూ దూసుకు పోతూ ఉంటే ’18 పేజెస్‌’ లో ఆ జోష్ లేదు.

18 పేజెస్  కలెక్షన్స్ మాత్రం టీమ్ అంతా ఆశించిన విధంగా రాలేదు. ఈ విషయంలో నిఖిల్ సిద్ధార్థ్ చాలా నిరుస్తాహం తో ఉన్నాడట. ఎంతో కష్ట పడి సినిమా చేసి, మళ్లీ కొన్ని రీషూట్ చేసినా లాభం లేదని అంటున్నాడని తెలుస్తోంది. ఇందులో ఏది తక్కువ అయ్యింది అని తన సన్నిహితులను అడుగు తున్నాడట. వారు మాత్రం ఒక్కటి తగ్గింది పుష్ప అంటూ బదులు ఇస్తున్నారట.. ఆ ఒక్కటి మీకు తెలుసు లేండి…

Read more RELATED
Recommended to you

Exit mobile version