ఏప్రిల్ 19 శుక్రవారం-రోజువారి రాశిఫలాలు
మేషరాశి: మంచి ఆరోగ్యం, కుటుంబ సఖ్యత, ప్రేమికుల మధ్య అనవసర వాదాలు, పనిచేసే చోట ఒత్తిడి, అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోండి.
పరిహారాలు: హనుమాన్ దేవాలయ దర్శనం, ప్రదక్షిణలు మేలు చేస్తాయి.
వృషభరాశి: ఆరోగ్యం, కుటుంబ సహకారం, ప్రేమికులకు అనుకూలమైనరోజు, తోటి ఉద్యోగుల నుంచి సహకారం ఉండదు, వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, ఆంజనేయస్వామికి పూజ కలిసి వస్తుంది.
మిథునరాశి: ఆనారోగ్య సూచన, కుటుంబంలో అపార్థాలు, ప్రేమికులకు అనుకూలం, సాధారణం కంటే పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి, ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి.
పరిహారాలు: నవగ్రహాలకు ప్రదక్షిణలు, ఆంజనేయస్వామికి అష్టోతర పూజ మేలు చేస్తుంది.
కర్కాటకరాశి: మంచి ఆరోగ్యం, కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు, ప్రేమికులకు సంతోషం, పనిచేసేచోట అనుకూలత, ప్రయాణాలకు అనుకూలం, ఆర్థిక వెసులు బాటు ఉంటుంది.
పరిహారాలు: దుర్గాదేవి దగ్గర చండీదీపారాధన చేయండి.
సింహరాశి: ఆరోగ్యం మంచిగా ఉంటుంది, కుటుంబ సహకారం, ప్రేమికులకు అనుకూలం, పనిచేసే చోట ప్రశంసలు, ప్రయాణాలకు అనుకూలం, ఆర్థికంగా స్వల్ప ఇబ్బంది.
పరిహారాలు: దగ్గర్లోని ఆంజనేయాలయంలో ప్రదక్షిణలు చేయండి. మేలు జరుగుతుంది. వీలైతే అష్టోతరం చేయించండి.
కన్యారాశి: ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వండి, కుటుంబంతో ఎక్కువ సమయం గడపండి, ప్రేమికులకు అనుకూలం, పనిలో తోటివారితో ఒకింత ఇబ్బంది, ప్రయాణాల వల్ల అలసట, అకస్మిక ఖర్చులు.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, దేవాలయ ప్రదక్షిణలు, ఆంజనేయస్వామి తీర్థప్రసాదాలు స్వీకరిస్తే మంచి ఫలితాలు ఇస్తాయి.
తులారాశి: స్వల్ప అనారోగ్య సమస్యలు, కుటుంబంలో ఏం జరుగుతుందో పరిశీలించాల్సిన సమయం, పని ఒత్తిడి ఎక్కువ, ప్రయాణాల వల్ల ఇబ్బందులు, ఆర్థికంగా స్వల్ప ఇబ్బందులు.
పరిహారాలు: నవగ్రహ ప్రదక్షిణలు, దుర్గాదేవికి దీపారాధన చేయండి.
వృశ్చికరాశి: మంచి ఆరోగ్యం, కుటుంబంలో సంతోషం, ప్రేమికులకు సాధారణంగా ఉంటుంది, పనిచేసే చోట ఒత్తిడి, ప్రయాణాలు వాయిదా వేసుకోండి, అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి.
పరిహారాలు: ఆంజనేయస్వామి దేవాలయంలో రాహుకాలంలో దీపారాధన చేస్తే మంచి ఫలితాలు.
ధనస్సురాశి: మంచి ఆరోగ్యం, కుటుంబంలో శుభకార్య సూచన, ప్రేమికులకు అనుకూలమైన రోజు, పనిచేసే చోట అనుకూలత, ఆర్థికంగా మంచిగా ఉంటుంది.
పరిహారాలు: ఆంజనేయస్వామికి అష్టోతర పూజ, వడపప్పు, పానకం సమర్పణ చేయండి.
మకరరాశి: మంచి ఆరోగ్యం, శుభకార్యసూచన, ప్రేమికులకు అనుకూలం, పనిచేసేచోట ప్రశంసలు, ప్రయాణాలు అనుకూలిస్తాయి, ఆకస్మిక ఖర్చులు.
పరిహారాలు: రాహుకాలంలో అమ్మవారికి దీపారాధన చేయండి.
కుంభరాశి: ఆరోగ్యం, కుటుంబ సహకారం, ప్రేమికులకు అనుకూలం, విజయవంతంగా పనిచేస్తారు, ప్రయాణాలకు అనుకూలం, ఆర్థికంగా సాధరణంగా ఉంటుంది.
పరిహారాలు: గణపతి ఆరాధన, గరికతో పూజ మంచిది.
మీనరాశి: మంచి ఆరోగ్యం, కుటుంబంలో శుభవార్తలు, ప్రేమికుల మధ్య స్వల్ప బేధాలు, పనిచేసేచోట టైం మేనేజ్మెంట్ చేసుకోండి, ఆర్థికంగా స్థిరత్వం, ప్రయాణాలు అనుకూలం.
పరిహారాలు: ఆంజనేయస్వామికి అష్టోతర పూజ చేయించండి, ప్రదక్షిణలు చేయండి సర్వం జయం కలుగుతుంది.
-కేశవ