మనం ప్రతిరోజు వాడే 192.168.0.1 నంబర్‌కు అర్థం ఏంటో తెలుసా? దీన్ని చూస్తుంటే మీకు ఇది ఏదో ఐపీ అడ్రస్‌లా ఉంది కదా! ప్రతి నంబర్‌కి ఏదో ఒక వెబ్సైట్ ఐపీతో సంబంధం ఉంటుంది. కానీ ఈ ఐపీ మాత్రం రోజూ మనం మన వాడే రూటర్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్లంటినీ యాక్సెస్ చేయడానికి వాడేది ఈ ఐపీ అడ్రస్ దీని వివరాలు..
ప్రత్యేక ప్యాటర్న్
సాధారణంగా మనం ఎవరికైనా మెయిల్ ఐడీ ఎలా అవసరమో.. ఇంటర్నెట్ మెసేజ్‌లను పంపేందుకు, రిసీవ్ చేసుకునేందుకు పీసీకి ఐపీ అడ్రస్ అదేవిధంగా అవసరముంటుంది. ప్రతి ఐపీ అడ్రస్‌కి దాని కంటే స్పెషల్ నంబర్ల రేంజ్ ఉంటుంది. అది కూడా ఒక ప్రత్యేకమైన ప్యాటర్న్ కూడ ఉంటుంది. ఈ రకం అడ్రస్‌లకు రెండు మూడు అక్షరాల తర్వాత ఫుల్‌స్టాప్స్ ఉండటం మనం చూస్తుంటాం. అయితే వాటిలో 192.168.0.1 గురించి చాలామంది ఇంటర్నెట్ యూజర్లకు తెలుసు. దీనికి సంబంధించిన వివరాలు మాత్రం కొంతమందికే తెలుసు.
ఇంటర్నెట్ ఇంజినీరింగ్ టాస్క్‌ఫోర్స్, ఇంటర్నెట్ అసైన్డ్ నంబర్స్ అథారిటీ క్లోజ్డ్ నెట్ వర్క్ కోసం 1996లో ఈ నంబర్లను పిక్ చేశారు. వీటిని పబ్లిక్ నెట్వర్క్ ప్రాంతాల్లో వాడటానికి వీలుండదు. ఆ విధంగా ఎంపిక చేసిన నంబర్లలో 192.168.0.1. ఈ ఫార్మాట్ డాట్ డెసిమల్ అంటారు. 11000000.10101000 డెసిమల్ ఫార్మాట్లో చేయగా వచ్చిన సంఖ్య 192.168.0.1.
మొదటి రెండు నంబర్లు అంటే 192, 168 కంప్యూటర్ నెట్వర్క్ని వివరిస్తుంది. చివరి రెండు నంబర్లు అడ్రస్ని చెబుతాయి. అందు కోసమే కొన్ని కంప్యూటర్లలో చివరి రెండు నంబర్లు మారుతూఉంటాయి. రూటర్ల పాస్వర్డ్ మార్చడానికి, వాటిని నియంత్రించడానికి ఏది చేయాలన్న దీంట్లో లాగిన్ అవ్వాల్సిందే.
ఉపయోగించే విధానం
మీ రూటర్ నెట్వర్క్ ఐపీ ఇదే అయితే మీరు సమస్యను పరిష్కరించడం సులభం. దీనికి కంప్యూటర్ పరిజ్ఞానం అవసరముండదు. నెట్ గేర్ రూటర్ వాడుతున్నట్లయితే 192.168.0.1 అని టైప్ చేయండి లేదా //http/www.routerlogin.net/ అని టైప్ చేయండి. పాస్వర్డ్ అడుగుతుంది. ఐడీ ఎప్పుడూ ‘్చఛీఝజీn’ అనె ఉంటుంది. పాస్వర్డ్ మీరు మార్చుకోకపోతే 1234 అని టైప్ చేసి చూడండి. అప్పుడు వెంటనే లాగిన్ అవుతుంది. మీ çరూటర్ సమస్య ఎంటో సులభంగా చూడవచ్చు.
రూటర్ యూజర్ నేమ్, పాస్వర్డ్ మారిచిపోతే వెంటనే డీఫాల్ట్ సెట్టింగ్ చేయాలి. దీనికోసం రూటర్ వెనుకభాగంలో ఉన్న రీసెట్ బటన్ని సూదితో గట్టిగా నొక్కండి. పదిహేను సెకన్ల తర్వాత రూటర్ ఆగిపపోయి తిరిగి ఆన్ అవుతుంది. ఆ విధంగా సెట్టింగ్ చేసుకునే వీలుంటుంది. ఐడీ పాస్వర్డ్ కూడా మార్చుకోవచ్చు.