ఏదైనా బిజినెస్ స్టార్ట్ చెయ్యాలనుకుంటున్నారా…? అయితే ఈ ఐడియా ఒకసారి చూడండి..!

-

మీరు ఏదైనా చిన్న బిజినెస్ ని స్టార్ట్ చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే ఈ ఐడియాని చూడండి. ఫుడ్ బిజినెస్ రంగంలో టొమాటో కెచప్ తయారీది ప్రత్యేక స్థానం అని స్పెషల్ గా చెప్పక్కర్లేదు. స్వయం ఉపాధి ద్వారా ఆదాయం పొందాలి అంటే టొమాటో కెచప్ తయారీ యూనిట్ ని స్టార్ట్ చెయ్యొచ్చు. దీనితో మీరు మంచిగా సంపాదించవచ్చు. అయితే దీని కోసం ఏం కావాలి…? , ఎలా స్టార్ట్ చెయ్యాలి..?, ఎంత లాభం పొందొచ్చు..? ఇలా అనేక విషయాలు ఇక్కడ తెలుసుకోండి. టొమాటో కెచప్ పరిశ్రమ లో లాభాలు కూడా బాగానే ఉన్నాయి. పైగా మంచి డిమాండ్ ఉంది.

ఈ తయారీ కోసం ఏడు రకాల మిషన్స్ అవసరం. ఫ్రూట్ వాషింగ్ మిషిన్, సార్టింగ్ మిషిన్, క్రషింగ్ మిషిన్, పల్పింగ్ మిషిన్, కుకింగ్ మిషిన్, హోమోజినైజర్, బాటిల్ ఫిల్లర్, బాటిల్ వాషింగ్ మెషిన్, బాటిల్ కాప్ మిషిన్ ఉండాలి. అలానే ఫ్రెష్ టొమాటోల అవసరం. చిల్లీ సాస్ కి అయితే పచ్చిమిరప, పండు మిరప అవసరం అవుతాయి. వీటితో పాటుగా మనకి ఫుడ్ కలర్స్, సాల్ట్, మసాలా దినుసులు, నీళ్లు కావాలి.

మొదట మీరు సార్టింగ్ మిషిన్, క్రషింగ్ మిషిన్ వీటి అన్నింటికీ కలిపి మొత్తం ఒక సప్లై చెయిన్ ఏర్పాటు చేసుకోవచ్చు. 1000 గజాల స్థలం ఈ బిజినెస్ కి కావాలి. అలానే ప్లాంట్ కి అయితే సెమీ ఆటోమేటిక్ తీసుకోవాలంటే రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఒకవేళ ఫుల్లీ ఆటోమేటిక్ అంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. దాని కోసం రూ.20 నుంచి రూ. 25 లక్షల పెట్టుబడి అవసరం. మీరు యూనిట్ ని స్టార్ట్ చెయ్యాలంటే ఫర్మ్ రిజిస్ట్రేషన్ తో పాటు, ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికేట్ అవసరం అవుతుంది. ట్రేడ్ లైసెన్స్ కూడా కావాల్సి ఉంటుంది.

ఇక డబ్బులు విషయానికి వస్తే.. ఒక కేజీ టమోటో సాస్ తయారీకి మనకు రూ. 75 ఖర్చు అవుతుంది. మీరు హోల్ సేల్ లో రూ.85 వరకూ అమ్మవచ్చు. ఈ లెక్కన గంటకి 100 కేజీలని తయారు చేస్తే రూ.1000 లాభం వస్తుంది. రోజుకి మీరు ఎనిమిది గంటలు తయారు చేస్తే రూ. 8000 ఆదాయం వస్తుంది. ఈ లెక్కన నెలకు రూ. 2 నుంచి రూ.5 లక్షల ఆదాయం పొందే వీలుంది. మీరు హోటల్స్, కేటరింగ్ వగైరా వాళ్ళ వద్ద కాంట్రాక్ట్ తీసుకుంటే మీకు మంచిగా రాబడి వస్తుంది. పైగా మీ వ్యాపారం కూడా బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version