వారికి గమనిక.. ఈ ఖాతాతో రూ.2.30 లక్షల ప్రయోజనం…!

-

ప్రతి ఒక్కరికీ బ్యాంక్ ఖాతా ఉండాలనే ఉద్దేశ్యంతో మినిమమ్ బ్యాలెన్స్ ఉండక్కర్లేకుండా జీరో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చని జన్ ధన్ యోజన ఫథకాన్ని కేంద్రం తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. చాలా మంది ఈ అకౌంట్ ని ఓపెన్ చేసారు. అయితే జన్ ధన్ అకౌంట్ ఉన్న బ్యాంక్ లో మరో ఖాతా ఉన్నవాళ్లు కూడా వున్నారు.

మీకు కూడా అలా ఉందా అయితే ఇది చూడాల్సిందే. ఒకే బ్యాంక్ లో ఒకే ఆధార్ తో రెండు అకౌంట్లు కనుక ఉంటే…. అప్పుడు ఆన్ లైన్ ట్రాన్సక్షన్స్ చేయడం కుదరదు. పైగా యోనో, ఎస్బీఐ వంటి వాటికి లాగ్ ఇన్ కూడా అవ్వలేరు. దీని మూలంగానే జన్ ధన్ ఖాతాలను క్లోజ్ చేస్తున్నారు.

జన్ ఖాతాను క్లోజ్ చేస్తే రూ. 2.30 లక్షల వరకు నష్టపోయే అవకాశముంది. జన్ ధన్ ఖాతా కలిగిన వారికి ఉచితంగానే రూపే డెబిట్ కార్డు ఇస్తారు. రూ.2 లక్షల వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ని దీని పై పొందొచ్చు కూడా. అంతే కాక రూ. 30 వేల వరకు బీమా వీళ్ళకి వస్తుంది.

ఒకవేళ కనుక అకస్మాత్తుగా మరణిస్తే వారి కుటుంబానికి వీటిని ఇస్తారు. కానీ ఆధార్ కార్డు లింక్ చేయకపోతే ఈ లాభాలు వుండవు. కనుక ఆధార్ తో లింక్ చేయడం, సంబంధిత ప్రూఫ్స్ ని ఇవ్వడం, డీటెయిల్స్ ని ఇవ్వడం ఎంతో ముఖ్యం. కనుక అలా చెయ్యండి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version