తిరుమల స్వామివారి హుండీలో 20 బంగారు బిస్కెట్లు…!

-

కరోనా కారణంగా లాక్‌డౌన్‌ కొనసాగింది. అయితే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా కొద్ది రోజుల పాటు మూసి వేయడం జరిగింది. ఆ సమయంలో ఒక భక్తుడు శ్రీవారికి అర్పించిన కానుక పెద్ద విశేషంగా మారింది. సహజంగా స్వామి వారికి భక్తులు ఎన్నో కానుకలు హుండీలో వేస్తారు. ఆ ప్రత్యేకత ఎప్పుడు మనకి కనిపిస్తూనే ఉంది. ఇదిలా ఉండగా ఇప్పుడు మాత్రం నిజంగా పెద్ద విశేషం జరిగినట్టే ఉంది. అయితే ఏకంగా హుండీలో 20 బంగారు బిస్కెట్లను స్వామి వారికి కానుకగా సమర్పించారు.

tirumala

అయితే ఆ బిస్కెట్లు ఒక్కొక్కటి రెండు కిలోలు ఉన్నాయట. దీని ప్రకారం మొత్తం 40 కిలోలు ఉన్నాయి. ఒక అజ్ఞాత భక్తుడు 20 బంగారు బిస్కెట్లను హుండీలో సమర్పించాడు. శనివారం నాడు హుండీ లెక్కింపు లో భాగంగా ఈ బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. ఈ విషయాన్ని స్వయంగా టీటీడీ ఎగ్జిక్యూటివ్ అధికారి అనిల్ కుమార్ సింగల్ వెల్లడించారు. అయితే ఒక్కొక్క బంగారు బిస్కెట్ రెండు కిలోగ్రాములు ఉన్నాయని చెప్పారు.

వీటి విలువ మొత్తం రూ 16.7 కోట్లు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గత నాలుగు నెలల పాటు తిరుమల దేవస్థానం మూసి ఉంది. అయితే జూన్ 11వ తేదీ నుంచి ఆలయాలు తిరిగి తెరిచారు. అప్పటి నుండి చూడగా శ్రీవారికి వచ్చిన అతి పెద్ద విరాళం ఇదేనని వాళ్ళు తెలిపారు అయితే లాక్ డౌన్ తర్వాత నుంచి నేటి వరకు సుమారు 2.5 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

ఇదిలా ఉండగా ఆన్లైన్ బుకింగ్ లో కూడా చాలామంది టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ 67 వేల మంది భక్తులు వరకు పూజకు రాలేదని తెలిపారు. కరోనా ప్రభావం ఆలయం పై కూడా పడింది. ఈ ఆలయంలో పని చేస్తున్న ఉద్యోగులు 91 మందికి కరోనా సోకిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version