అవును! చంద్రబాబు అనుకూల మీడియా చేసిన అత్యుత్సాహం.. ఇప్పుడు బాబునే ఇరికించిందనే వ్యా ఖ్యలు వినిపిస్తున్నాయి. తాజాగా జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు చేసిన ప్రయత్నం వికటించి.. నేరుగా చంద్రబాబుకే దెబ్బ తగిలేలా చేసిందని అంటున్నారు. విషయంలోకి వెళ్తే.. `సంచార జాతులకు విముక్తి ఏదీ?` శీర్షికన చంద్రబాబు అనుకూల మీడియాలో పుంఖాను పుంఖాలుగా ఓ కథనం వచ్చింది. దీనిలో బీసీ వర్గానికి చెందిన బీసీ-ఏ సబ్ కేటగిరీలో చాలా సామాజికవ ర్గాలు నేటికి ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉన్నారని, వీరిని జగన్ ప్రభుత్వం కన్నెత్తి చూడడం లేదని, పన్నెత్తి పలకరించడం లేదని కూడా రాసుకొచ్చింది.
ఏడాదికో చోట సంచార జీవనం గడుపుతూ ఉండే ఈ జనాలకు…. రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులు, బ్యాంకు ఖాతాలు వంటి గుర్తింపులు కూడా లేకపోవడంతో ఎలాంటి ప్రభుత్వ పథకాలకూ నోచుకోవడం లేదు. అందుకే జగన్ ప్రభుత్వం ఇచ్చిన నవరత్నాలకు సంబంధించిన పథకాల్లో వీరెవరూ లబ్ధిదారులు కాలేకపోయారు. అని సదరు మీడియా రాసుకొచ్చింది. వీరిలో బాలసంతు/బాహురూపి, బండార, బుడబుక్కల, దాసరి, దొమ్మర, గందిరెద్దులవారు, జంగం, జోగి, కాటిపాపల, కొర్చ, మొండివారు/బండ/మొండిబండ, పిచ్చిగుంట్ల/వంశీరాజ్, పాముల, పార్థి, పంబల, దమ్మాలి, వీరముష్టి/నెట్టికోటల/వీరభద్రే
అయితే, మరి ఐదేళ్ల పాటు.. బీసీలే తమకు ప్రాణమని చెప్పుకొచ్చిన చంద్రబాబు కానీ, ఆ పార్టీ నేతలు కానీ .. వీరిని ఎందుకు పట్టించుకోలేదు.? నిర్దిష్టమైన రేషన్‌కార్డులుగానీ, ఆధార్, బ్యాంకు ఖాతాలు ఎందుకు ఇవ్వలేక పోయారు? నిజానికి రాష్ట్రంలో బీసీలే తమకు వెన్నెముక అని చెప్పుకొచ్చే చంద్రబాబు.. గడిచిన ఐదేళ్ల కాలంలో ఈ కులాల వారికి ఏదైనా చేస్తానంటే.. ఎవరైనా వద్దని చేయి అడ్డు పెట్టారా? లేక వద్దని ఆయా కులాల వారే ఏమైనా వినతి పత్రాలు ఇచ్చారా ? నాడు చంద్రబాబు పట్టించుకుని, ఆయా కులాల వారికి అన్ని రకాల సదుపాయాలు అమలు చేసి ఉంటే.. నేడు అమలు చేయడం లేదని శోకించినా అర్ధం ఉంటుంది.