తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 20 బ్లడ్ స్టోరేజ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. అంతే కాకుండా రాష్ట్రంలో ఆస్పత్రలను ఆధునీకరరిస్తామని తెలిపారు. కాగ ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న ఫీవర్ సర్వే, వ్యాక్సిన్ ప్రక్రియా గురించి వైద్య ఆరోగ్య అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు పలు కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రంలో కొత్తగా 20 బ్లడ్ స్టోరేజీ సెంటర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.
అలాగే రాష్ట్రంలో ఉన్న పలు ఆస్పత్రిలకు మౌళిక సదుపాయాలను కల్పించి ఆధునీకరిస్తామని తెలిపారు. అలాగే కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు ప్రక్రియా కూడా కొనసాగుతుందని వెల్లడించారు. అలాగే కరోనా కట్టడి కోసం చేస్తున్న ఫీవర్ సర్వే విజయ వంతంగా కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే వ్యాక్సినేషన్ మొదటి డోసు పంపిణీలో మన రాష్ట్రం ముందు ఉందని తెలిపారు. రెండో డోసు ను కూడా త్వరగా వంద శాతం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.