గురుకుల విద్యార్థులకు గుడ్ న్యూస్.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన

-

తెలంగాణ గురుకుల విద్యార్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. సోమవారం బంజారాహిల్స్ లోని కొమురంభీమ్ భవన్ లో జరిగిన బీసీ సంక్షేమ శాఖ విస్తృత స్థాయి అధికారుల సమీక్ష సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని గురుకులాల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈఏపీసెట్ (ఎంసెట్),
నీట్ కోచింగ్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రస్తుతం మోడల్ స్కూల్స్ లో
అమలవుతున్నట్లుగానే బీసీ గురుకులాల్లో కూడా పదో తరగతి ఉత్తీర్ణత కాగానే నేరుగా
ఇంటర్మీడియట్ కి వెళ్లేలా చర్యలు తీసుకుంటామని  వెల్లడించారు.

గురుకులాల్లో ఇంటర్ లో కంప్యూటర్ తో పాటు అన్ని కోర్సులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గురుకులాల్లో చదువుతున్న 8,9,10 తరగతి విద్యార్థులకు రెడ్ క్రాస్, ఎన్ సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్ లలో ప్రతి విద్యార్థి రెండిటిలో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. బీసీ గురుకులాలు రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండాలని ఈ నెల 15వ తేదీ నుంచి 31 లోపు ఈ గురుకులాల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. దసరా లోపు రెంటెడ్ గురుకుల భవనాలకు 50 శాతం అద్దె చెల్లిస్తామని  వెల్లడించారు మంత్రి పొన్నం ప్రభాకర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version